రాజమౌళి కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ప్రభాస్, తారక్..!

భారతదేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహ వేడుక తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ వివాహ వేడుక కోసం స్టార్ హీరోలు అయిన ప్రభాస్ మరియు ఎన్టీఆర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న క్రమంలో ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు . త్వరలో జరగబోయే పెళ్లి వేడుకకు ముందు ఫ్రీ వెడ్డింగ్ డిన్నర్కి దగ్గరుండి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్రభాస్, ఎన్టీఆర్. వీళ్లు హోస్ట్ గా డిన్నర్ పార్టీలకు వెళ్లే అతిథులకు వీరు చేసే సత్కార్యాలు తట్టుకోవడం చాలా కష్టమని టాక్ వినపడుతుంది. అత్యంత విలాస వంతమైన డిన్నర్ పార్టీలను హోస్ట్ చేయడంలో ప్రభాస్, ఎన్టీఆర్ లను మించిన హీరోలు మరెవ్వరూ లేరు అని అంటారు. ఇలాంటి పరిస్థుతులలో కార్తికేయ కోసం మరో భారీ డిన్నర్ పార్టీకి ప్రభాస్ జూనియర్ లు చేయి చేయి కలిపారు.బయటకు వచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న ఒక విలాస వంతమైన రిసార్ట్ లో ఈ భారీ పార్టీ ఈవారం జరగబోతున్నట్లు సమాహారం. ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ హీరోలతో పాటు యంగ్ హీరోలను కూడ ప్రభాస్ జూనియర్ లు వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా అనేకమంది ప్రముఖ దర్శకులు నిర్మాతలు మరికొంతమంది ప్రముఖ హీరోయిన్స్ ను కూడ ఈ పార్టీకి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద తన కెరియర్ లో అత్యంత మర్చిపోలేని బ్లాక్బస్టర్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళికి ఈ విధంగా ఈ టాప్ హీరోలు రుణం తీర్చుకుంటున్నారు అని అంటున్నారు సినిమా విశ్లేషకులు.

Comments

comments

Leave a Reply

*