రాజుగారి గది 2 ట్రైలర్ టాక్

భగవద్గీత లోని ‘ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు… ఆత్మ నాశనము లేనిది’  శ్లోకం తో మొదలు అవుతుంది రాజుగారి గది 2 ట్రైలర్. ఈ సినిమా కోసం ఓం కార్ పడిన కష్టం అంతా తెరమీద కనిపించబోతోంది అని ఈ ట్రైలర్ ప్రూవ్ చేసింది. శకలక శంకర్ , ప్రవీణ్ , వెన్నెల కిషోర్ ప్రధాన కమీడియన్ లుగా సాగిన ఈ ట్రైలర్ లో నాగార్జున మెంటలిస్టు గా కనపడి సూపర్ అనిపించారు. దయ్యం అయిన సమంత ని ఊరమాస్ దయ్యంగా పిలుస్తూ దాని ఆట కట్టించే ప్రయత్నం చేస్తారు నాగ్. ఒక అమ్మాయి పగతో ప్రతీకారం తో ఆత్మగా ఉండిపోయింది అనీ అది సీరత్ కపూర్ ని పట్టుకుంది అని చెబుతాడు నాగార్జున. ఆత్మ ఆకారాన్ని చిత్రిస్తే, దానంతట అదే మాయం కావడం వంటి దృశ్యాలతో ఈ ట్రయిలర్ అలరిస్తోంది. బొమ్మాలీ నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ రాజుగారి గది ఫస్ట్ పార్ట్ లో వచ్చిన డైలాగు నే ఇక్కడ కూడా వాడి ఫన్ పుట్టించాడు ఓం కార్.

Comments

comments

Leave a Reply

*