నెగెటివ్ సెంటిమెంట్ .. కాటమరాయుడు లాంటి ఇబ్బందే జై లవ కుశ కి కూడా

పెద్ద పెద్ద హీరోల సినిమాలకి మెయిన్ షో ల కంటే బెనిఫిట్ షో లకే డిమాండ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ హీరోల లెక్కలో అతని క్రేజ్ చూడాలి అంటే అర్ధరాత్రి ఆట పడిన టైం లో రచ్చ చూస్తే సరిపోతుంది. ఒక హీరో సినిమా కోసం నిద్ర సైతం మానుకుని ఎగబడి థియేటర్ లలో సినిమాలు చూసేవాళ్ళు బోలెడుమంది ఉంటారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం లో వస్తున్న కొత్త సినిమా జై లవ కుశ కి బెనిఫిట్ షో ల కోసం ప్రయత్నిస్తున్న హైదరాబాద్ ఎన్టీఆర్ ఫాన్స్ కి చుక్క ఎదురు అయ్యింది. డీసీపీ సెల‌వులో ఉండ‌డం, ఇన్ ఛార్జ్ డీసీపీ ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ షోకి అనుమ‌తి వ‌స్తుందా? రాదా? అనేది అనుమానంగా మారింది. బ్రమరాంబ లో తెల్లవారు జాము మూడు గంటలకే ఫాన్స్ షో వెయ్యడం కోసం విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మొన్న కాటమరాయుడు , పైసా వసూల్ సినిమాల విషయం లో కూడా ఇది కుదరలేదు. సో ఈ సినిమాకి కూడా అదే కష్టం ఎదురు అయ్యేలా ఉంది అంటున్నారు.

Comments

comments

Leave a Reply

*