బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చినా దీక్ష vs అర్చన ఇంకా నడుస్తోంది .. ఇదిగో ఇలా

స్టార్ మా లో ఆఖరి వారానికి చేరుకుంది బిగ్ బాస్ షో .. బిగ్ బాస్ హౌస్ నుంచి గత వారం దీక్షా పంత్ బయటకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం అర్చనతో గొడవ పడుతూనే ఉంది, ఇప్పుడు బయటకి వచ్చిన తరవాత కూడా అర్చనా – దీక్ష ల మధ్యన మాటల యుద్ధం తగ్గడం లేదు. దీక్ష వెళుతూ వెళుతూ నన్ను నానా మాటలూ అంది అంటూ అర్చన షో లో గొడవ చేస్తుంటే బయట దీక్ష కూడా అదే రేంజ్ లో మీడియా కి ఎక్కి అర్చన నిజ స్వరూపం సరైనది కాదు అంటూ చెబుతోంది. బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకి వచ్చిన తరవాత ఒక రీసెంట్ ఇంటర్వ్యూ ఇచ్చిన దీక్ష ధనరాజ్ ధోరణి తనకి నచ్చలేదు అనీ అలాగే అర్చన తనని చాలా బాధపెట్టంది అని చెప్పుకొచ్చింది.  తన పని తాను చేసుకువెళ్లే దానిననీ, కంటెస్టెంట్స్ మధ్య ఏదైనా డిస్కర్షన్ జరిగితే టీవీలో చూపిస్తారనే సంగతి తనకి బయటికి వచ్చాక తెలిసిందని చెప్పారు. తాను బయటకి వచ్చిన తరవాత కూడా అర్చన ఇంకా తనని కామెంట్ చేస్తూ ఎక్కిరిస్తూ ఉండడం తనకి అస్సలు నచ్చలేదు అని సీరియస్ అయ్యింది దీక్ష.

Comments

comments

Leave a Reply

*