త్వరపడండి.. ఆలసించిన ఆశాభంగం

అమెజాన్ ఈ కామర్స్ సంస్థ.. మరోసారి గ్రేట్ ఇండియన్ సేల్ ను.. అందుబాటులోకి తెచ్చింది. ఇవాల్టి నుంచి 12వ తేదీ వరకూ.. అనూహ్యమైన ఆఫర్లను అందిస్తోంది. ట్రిమ్మర్ల నుంచి మొదలు పెడితే.. వాషింగ్ మెషీన్ల వరకూ.. రకరకాల ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, ఫ్యాషన్, రెగ్యులర్ యూసేజ్ ఐటమ్స్ ను డిస్కౌంట్లతో అందిస్తోంది. పైగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులతో బిల్లులు చెల్లించిన వారికి.. 15 శాతం వరకూ డిస్కౌంట్స్ ప్రకటించింది.

అయితే.. 15 శాతం డిస్కౌంట్ అనేది.. కేవలం యాప్ తో బుకింగ్స్ చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది. అదే.. వెబ్ సైట్ లో బుక్ చేసుకున్నవాళ్లను కూడా ఏమాత్రం నిరాశపరచకుండా.. ఎస్బీఐ కార్డుతో బిల్లులు చెల్లించిన వారికి కనీసం 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. కాకపోతే.. మీరు కనీసం 5 వేల రూపాయల బిల్లు చేస్తేనే క్యాష్ బ్యాక్ ఉంటుంది. అలాగే.. మ్యాగ్జిమమ్ క్యాష్ బ్యాక్.. అంటే గరిష్టంగా ప్రతి కార్డుపై 1500 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది.

మరి ఇంకెందుకు ఆలస్యం.. శ్రావణ మాసం.. పండగల సమయం.. కావాల్సినవి కొనేయండి. ఆఫర్లు అనుభవించండి.

Comments

comments

Leave a Reply

*