ముద్రగడ మీద కోపాన్ని.. జగన్ పై చూపిస్తే ఎలా?

తెలుగుదేశం పార్టీ రాజకీయాలు.. ఆంధ్రప్రదేశ్ లో వింత పరిస్థితిని నెలకొల్పుతున్నాయి. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. ముద్రగడ మీద ఉన్న కోపాన్ని.. ప్రతిపక్ష నేత జగన్ మీద తీర్చుకుంటున్నారు.. టీడీపీ నేతలు. మామూలు కార్యకర్తలకు అంటే.. ఎలా మాట్లాడాలో తెలియదు అనుకోవచ్చు. కానీ.. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప లాంటి నేతలు కూడా.. ఇదే తరహా రాజకీయం చేస్తుంటే.. జనానికి అసలు ఏం జరుగుతోంది? ఎవరు.. ఎవర్ని.. ఎందుకు.. ఎలా టార్గెట్ చేస్తున్నారు.. అన్నది అర్థం కాక.. టీడీపీ రాజకీయాలపై ప్రజలకు విరక్తి కలుగుతోంది.

అసలు విషయం ఏంటంటే.. ముద్రగడ పద్మనాభం.. కాపులకు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ ప్రభుత్వం మాట తప్పిందంటూ.. మళ్లీ దీక్షకు, ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో.. ఆయనను రెండు రోజులుగా ప్రభుత్వం హౌజ్ అరెస్ట్ చేయించింది. ఈ సందర్భానికి జగన్ కు ఏం సంబంధమో తెలియదు కానీ.. ఎప్పుడో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని ఇప్పుడు.. చినరాజప్ప గుర్తు చేస్తున్నారు. అసలు ప్లీనరీలో.. జగన్ ఎందుకు కాపుల రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా చినరాజప్పా?

ముద్రగడ దీక్ష గురించి మాట్లాడినపుడు.. ఆయన విషయం ప్రస్తావిస్తే బాగుంటుంది కానీ.. మధ్యలో జగన్ ను తీసుకురావడం ఎందుకు? అంటే.. సందర్భం ఉన్నా.. లేకున్నా.. జగన్ ను విమర్శిస్తే.. ఆయనకు ప్రజల్లో వచ్చే పాపులారిటీని కొంతైనా తగ్గించొచ్చని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలు మేం కాదు అడిగేది. జనాలే అడుగుతున్నారు. టీడీపీ సీనియర్ కార్యకర్తలు, రాజకీయ అవగాహన ఉన్నవాళ్లు కూడా.. చినరాజప్ప తీరును తప్పుబడుతున్నారు. అందుకే.. ఈ ప్రశ్నలకైనా సమాధానం ఇవ్వాలి.. లేదంటే.. తమ తీరునైనా టీడీపీ నేతలు మార్చుకోవాలి.

Comments

comments

Leave a Reply

*