మూడవ సీజన్ బిగ్ బాస్ షో కి తారక్ వైపు మొగ్గు చూపుతున్న మేనేజ్మెంట్..?

తెలుగు టెలివిజన్ రంగంలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ‘బిగ్‌బాస్’ షో. ఇప్పటిదాకా వచ్చిన 2 సీజన్ల లో వచ్చిన కంటెస్టెంట్ లు మరియు యాంకర్లు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో అలరించారు. ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియాలో బిగ్బాస్ సీజన్ 3 గురించి సంచలన పోస్టర్లు చక్కెర్లు కొడుతున్నాయి దాదాపు వారం రోజులపాటు నుండి. స్టార్‌మా ఛానెల్ లోగో, బిగ్‌బాస్-3 టైటిల్‌తో కూడిన ఆ పోస్టర్‌లో… ‘టైగర్ మరోసారి గర్జించడానికి సిద్ధంగా ఉన్నాడు’ క్యాప్షన్ కూడా రాసి ఉంది. ఇది అఫీషియల్ పోస్టరేనా కాదా అనేది క్లారిటీ లేదు కానీ… తారకే సీజన్‌-3కి హోస్ట్‌గా చేయనున్నాడనేది బలమైన వాదనలైతే వినిపించాయి. ఆ తర్వాత ఈ వార్తలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. ఇటు జనాలు కూడా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి టైంలో తాజాగా ఓ రూమర్ పుట్టుకొచ్చింది. బిగ్‌బాస్ సీజన్-3కి హోస్ట్‌గా విక్టరీ వెంకటేష్ రంగంలోకి దిగొచ్చనే ప్రచారం మొదలయ్యింది. ఈమధ్యే బిగ్‌బాస్ నిర్వాహకులు వెంకీని సంప్రదించారని, ఆయన కూడా హోస్ట్‌గా చేసేందుకు రెడీగా ఉన్నారని ఓ పుకారు షికారు చేస్తోంది. అయితే… దీని గురించి వెంకీగానీ, బిగ్‌బాస్ వర్గాలు గానీ ఇంతవరకూ స్పందించలేదు. అఫ్‌కోర్స్… బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రతి విషయాన్నీ రహస్యంగానే ఉంచుతారు కానీ… ఈ వార్తలు నిజమని నమ్మడానికి ప్రత్యేక సంకేతాలు కనిపించడం లేదు. అటు తారక్ కూడా తిరిగి హోస్ట్‌ బాధ్యతలు చేపట్టవచ్చని బలంగా చెప్పలేము గానీ… దాన్ని తోసిపుచ్చనలేము. కాబట్టి… పూర్తి క్లారిటీ రావాలంటే స్వయంగా ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యేంతవరకూ వేచి చూడాల్సిందే!

Leave a Reply

*