జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు.. జగన్ పై సంచలన కామెంట్స్..

ఇటీవల పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సోషల్ మీడియాలో బాలయ్య ఎవరో నాకు తెలియదు అంటే చేసిన కామెంట్ రచ్చ రచ్చ చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య పై చేసిన కామెంట్స్ గురించి వివరణ ఇచ్చారు నాగబాబు. అంతేకాకుండా ఎన్టీఆర్ బయోపిక్‌ని టార్గెట్ చేస్తూ నిజాలు లేని బయోపిక్‌లొద్దంటూ నాగబాబు పేల్చిన బాంబ్ తీవ్ర సంచలనం రేపింది. నందమూరి ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దీంతో… నాగబాబు సభలో వీరంతా వీరంగం సృష్టించారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ ‘జై బాలయ్య’ అంటూ స్లోగన్స్ చేశారు. అటు సోషల్ మీడియాలోనూ ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి గమనించిన నాగబాబు… చివరికి తాను బాలయ్య తెలియదని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు. ఆయన మాటల్లోనే…‘‘హలో ఫ్రెండ్స్.. కొంతకాలం నుంచి ఒక వ్యక్తి మీద నేను చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని నాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు నేను ఇలా సమాధానం చెప్పాల్సి వస్తోంది. నిజానికి నేనిలా వివాదాల జోలికి వెళ్ళను. అసలు ఇలాంటి వివాదాలతో మీడియాలో ఫోకస్ అవ్వాల్సిన అవసరమూ లేదు. ఇప్పుడు నాకున్నపేరు విలువలు చాలు. ఇక విషయానికొస్తే… నేను బాలయ్యపై అలా కామెంట్లు చేయడానికి ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని బాలయ్య అనడంతో నేను కౌంటర్ ఇచ్చానని చాలామంది అనుకున్నారు. ఒక్క మాటకే అంతలా ఫీలైతే ఎలా..? సరే కౌంటర్ అయితే ఇచ్చారు కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు సటైర్లు వేశారని నన్ను కొందరు ప్రశ్నించారు’’. ‘‘పవన్ కళ్యాన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, మీ బావ చంద్రబాబుకు ఎంతో సాయం చేశారు. చంద్రబాబు వచ్చి అడిగితే, పవన్ పోటీ చేయకుండా జగన్ గెలవాల్సిన పరిస్థితిలో మద్దతిచ్చి మీ గెలుపునకు కారణమయ్యాడు. అలాంటి పవన్ ఎవరో తెలియదంటే నాకు తీవ్రంగా బాధేసింది. ‘మీ పార్టీకి పనిచేసి, మీ పార్టీ గెలవడానికి కృషి చేసిన వ్యక్తినే మీరు తెలియదని అన్నప్పుడు.. మీరు తెలియదు అని నేనంటే ఎందుకంతగా ఫీలవుతున్నారు. మీరంటే ఫర్వాలేదు.. తిరిగి మేము అంటే కోపం వచ్చిందా.. ఇది మంచి పద్ధతి కాదు’ అంటూ బాలయ్యపై చేసిన కామెంట్లు నాగబాబు తిరిగి వివరణిచ్చారు.

Leave a Reply

*